Posts

Showing posts from March, 2019

దేవీ శక్తులు - దశ మహావిద్యలు

Image
దేవీ శక్తులు - దశ మహావిద్యలు : నేలనతికి బతుకుతున్న, నింగినంత వెతుకుతున్న నేనెవ్వరు? నేనెవ్వరు? కాగితాల కూరుకున్న, ఊపిరితో ఊగుతున్న నేనెవ్వరు? నేనెవ్వరు? నిద్రనించి తేరుకుని, నిద్రలోకి జారుకునే నేనెవ్వరు? నేనెవ్వరు? అని ఎన్నోసార్లు అనిపిస్తుంది . అనుదిన చైతన్య ప్రవాహం వెనుక కాల వ్యోమాతీతమైన విధిని నియంత్రించే శక్తి ఏదో అనిపిస్తుంది. దేన్ని ఆరాధిస్తే అన్నిటిని ఆరాధించినట్టవుతుందో అదే పరబ్రహ్మ శక్తి, దాన్నే అందరు సర్వగత చైతన్యము అన్నారు. జన్మనివ్వడం, సృష్టించడం అనేవి స్త్రీత్వం యొక్క అద్భుత తత్వం కనుక ఆ మూల శక్తి ని 'అమ్మ ' గా సేవించారు. గుణాతీత తత్వాన్ని అమ్మ అన్నా, నాన్న అన్నా లేక మరో పేరుతో పిలిచినా ఒకటే కదా! ఆ సర్వశక్తిని అనేకులు అనేక విధాలుగా ప్రార్ధించారు. లోకంబులు, లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు నతని నే పూజింతున్ (భాగవతము) యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తయై నమో నమః (దుర్గా సప్త శతి) ఎక్కడైనా ఒక చోట ఉండేదాన్ని పట్టుకుంటాం - చేపపిల్లల్ని పట్టినట్టు పట్టి ఎక్వేరియంలో పెంచుకుంటాం. ...

నవ గ్రహముల జననము

Image
🌚 నవ గ్రహముల జననము 🌚 🌕🌖🌗🌘🌑🌒🌓🌔🌕 1) సూర్యుడు : శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని  "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను (ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి) కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు 2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను (నందన...

సంకష్టహర చతుర్థి - Sankashtahara Chathurdhi

Image
రేపు  సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి...